July 20, 2026
Explore
దస్తావేజులేఖరులు , డీటీపి ఆపరేటర్లు నిరసన

దస్తావేజులేఖరులు , డీటీపి ఆపరేటర్లు నిరసన

July 20, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌శాఖను ప్రైవేటీకరణ చేస్తూ జీవో ఎంఎస్‌నెంబరు: 396ను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ పట్టణంలో దస్తావేజులేఖర్లు, డీటీపి ఆపరేటర్లు, ట్యాంప్‌వెండార్స్ లు సోమవారం నల్లబ్యాడ్జిలతో నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర దస్తావేజులేఖర్లు సంఘం పిలుపు మేరకు 20 నుంచి 31 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్‌డౌన్‌ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట ప్లకార్డులు పట్టుకుని పెన్‌డౌన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దస్తావేజులేఖర్ల సంఘం ప్రతినిదులు సుబ్రమణ్యంరాజు, కె.రామమూర్తి, పూలత్యాగరాజు, మునిరాజచారి, పవన్‌కుమార్‌, రవిచంద్రరాజు, జ్యోతి, శిల్ప, కృష్ణవేణి, ఖలీల్‌, గణేష్‌, రమణ, సాధిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Document clerks and DTP operators protest