July 20, 2026
Explore
విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

July 20, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

2025-2026 విద్యాసంవత్సరంలో పరోతరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సోమవారం నగదు బహుమతి ప్రోత్సాహకాలు అందుకున్నారు. పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి విద్యార్థిని వి.రోహిత , జెడ్పిహైస్కూల్‌ విద్యార్థిని టి.షహవార్‌, బాష్యంపాఠశాల విద్యార్థి షేక్‌మహమ్మద్‌సుభాన్‌, బసవరాజ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఎస్‌.తూభ, ఈ.అమృత లకు, అలాగే మండలంలోని మోడల్‌స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ చదువుతున్న కావాడి అక్షిత లకు మదనపల్లెలో షైనింగ్‌స్టార్‌ అవార్డు లను జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, డీఈవో సుబ్రమణ్యం చేతులు మీదుగా ప్రధానం చేశారు. ఈ అవార్డు సర్టిపికెట్‌తో పాటు రూ.20 వేలు నగదు బహుమతి కూడ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి పాఠశాల డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి, జెడ్పిహైస్కూల్‌ హెచ్‌ఎం రుద్రాణి, మోడల్‌స్కూల్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమ తదితరులు పాల్గొన్నారు.

Tags: Cash incentives for students