July 20, 2026
Explore
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రూ.10,000 జరిమానా..

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రూ.10,000 జరిమానా..

July 20, 2026 | Andhra Pradesh

శ్రీ సత్యసాయి ముచ్చట్లు:

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తాం ..ఎస్సై వెంకటేశ్వర్లు..

జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాలతో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణ లక్ష్యంగా పెనుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం నిర్వహిస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ తనిఖీలలో హెచ్. వినోద్ (28), తండ్రి హెచ్. నరసప్ప, తాడెంగిపల్లి గ్రామం, రొద్దం మండలం నివాసి, మద్యం సేవించి AP-39-FC-3119 నంబరు గల మోటార్‌సైకిల్‌ను నడుపుతూ పట్టుబడ్డాడు. అతనిపై కేసు నమోదు చేసి గౌరవనీయులైన సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, పెనుకొండ వారి ఎదుట హాజరు పరచడం జరిగిందన్నారు.
కేసును విచారించిన గౌరవనీయులైన న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించి రూ.10,000/- జరిమానా విధించింది.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నందున, వాహనదారులు మద్యం సేవించిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపవద్దని పెనుకొండ పోలీసులు విజ్ఞప్తి చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నేరాలకు పాల్పడే వారిపై భవిష్యత్తులో కూడా చట్టపరంగా కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్సై వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

Tags: A fine of ₹10,000 imposed on a person for driving under the influence of alcohol.