July 20, 2026
Explore
కర్లపాలెం లో కరోనా అని కలవరపడవద్దు. డాక్టర్ గోపీనాథ్

కర్లపాలెం లో కరోనా అని కలవరపడవద్దు. డాక్టర్ గోపీనాథ్

July 20, 2026 | Andhra Pradesh

కర్లపాలెం ముచ్చట్లు:

కర్లపాలెం మండలం లో కరోనా అని ఎవ్వరు కలవరపడవద్దు అని మండల వైద్యాధికారి డాక్టర్ గోపీనాథ్ తెలిపారు. మండల పరిధిలోని చింతాయ పాలెం గ్రామంలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది అని, కానీ అతను గత కొంత కాలంగా గ్రామంలో ఉండటం లేదని చికిత్స నిమిత్తం గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారూ అన్నారు. దీనిపై ఎవ్వరు కలవర పడవద్దు అని, ప్రజలు ధైర్యంగా ఉండాలి అని ఆయన తెలిపారు. ఇప్పటికే అక్కడ వైద్యశిబిరం ఏర్పాటు చేసి చుట్టు పక్కల వారికి పరీక్షలు చేశాము అన్నారు. ఎవ్వరికి ఎటువంటి లక్షణాలు లేవని డాక్టర్ గోపీనాథ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వైద్యాధికారిని డాక్టర్ విజయమ్మ సూచనలతో చాలా అప్రమత్తంగా ఉన్నాము అన్నారు.

Tags; Do not panic about Corona in Karlapalem. – Dr. Gopinath