పెరూ ముచ్చట్లు:
పెరూలోని మధ్య జునిన్ ప్రాంతంలో శనివారం రాత్రి వరుసగా 5.1, 3.7 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. ఈ ప్రకృతి విపత్తులో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 21 మంది గాయపడ్డారు. రాజధాని లిమాకు తూర్పున సంభవించిన భూకంపాల ప్రభావంతో సుమారు 48 ఇళ్లు పూర్తిగా కూలిపోవడంతో 300 మంది నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేయగా, బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Tags: Twin earthquakes in Peru… six dead.