అమరావతిముచ్చట్లు:
భారతీయ రైల్వేల్లో ప్రయాణించే దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని అందిస్తోంది. యూనిక్ డిసేబిలిటీ ఐడీ (UDID) కార్డు కలిగిన దివ్యాంగులు రైలు టికెట్ ధరపై రాయితీ పొందవచ్చని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ తెలిపింది.
వైకల్యం రకం, ప్రయాణించే కోచ్ (తరగతి) ఆధారంగా గరిష్ఠంగా 75 శాతం వరకు టికెట్ ఛార్జీలో రాయితీ లభిస్తుంది.
ఈ సౌకర్యాన్ని పొందేందుకు కనీసం 40 శాతం వైకల్యం ఉండాలి. అర్హులైన దివ్యాంగులు UDID కార్డుతో రైల్వే నిబంధనల ప్రకారం టికెట్ బుక్ చేసుకుని ఈ రాయితీని పొందవచ్చు.
Tags: Major relief for the differently-abled from Railways: Up to 75% concession on ticket fares with UDID card.