అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యత ప్రామాణికంగా సమస్యలు పరిష్కారం చేయాలి..
జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ..
జాప్యం లేకుండా పిజిఆర్ఎస్ సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా త్వరితగతిన పరిష్కరించాలని మదనపల్లి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలు నందు… ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జేసీతోపాటు సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ వెంకటేష్, కెఆర్ఆర్సి ఎస్డిసి చంద్రశేఖర్ రెడ్డి, సర్వే శాఖ ఏడి శాంతరాజ్ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ…. పిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు.
పెండింగ్ దరఖాస్తులు,బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారులనుండి వారు అర్జీలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 324 అర్జీలు రాగా వాటిపై తగు చర్య తీసుకొని పరిష్కరించు నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ ఎండార్స్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Tags: PGRS issues must be resolved without delay.