బండరామారం ముచ్చట్లు:
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే, కొందరు ఉపాధ్యాయుల బాధ్యతారాహిత్యం ప్రభుత్వ ఆశయాలకు గండి కొడుతోంది. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు గానూ బండరామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) హెడ్‌మాస్టర్‌తో పాటు నలుగురు ఉపాధ్యాయులను జిల్లా యంత్రాంగం సస్పెండ్ చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
జీరో ఎన్‌రోల్‌మెంట్‌పై కలెక్టర్, DEO సీరియస్,ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలో ఒక్క కొత్త అడ్మిషన్ కూడా నమోదు కాకపోవడం (జీరో ఎన్‌రోల్‌మెంట్) పై జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి (DEO) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరపగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు పంపేలా ఈ ఉపాధ్యాయులే వెనకుండి నడిపించినట్లు ఆరోపణలు వచ్చాయి. తాము పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాల పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడేలా, పాఠశాల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వీరు తప్పుడు ప్రచారం చేసినట్లు విచారణలో ప్రాథమికంగా నిరూపితమైంది.
Tags: Teachers’ Irresponsibility