July 20, 2026
Explore
శస్త్రచికిత్స అనంతరం తొలిసారిగా ఏపీకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

శస్త్రచికిత్స అనంతరం తొలిసారిగా ఏపీకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

July 20, 2026 | Andhra Pradesh

తాడేపల్లి ముచ్చట్లు:

శస్త్రచికిత్స అనంతరం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సోమవారం వచ్చారు.
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పలువురు ఉన్నతాధికారులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులో అధికారులు పూలబొకేలు అందించి డిప్యూటీ సీఎంను సాదరంగా ఆహ్వానించారు. శస్త్రచికిత్స తర్వాత ఆరోగ్యంగా ఉన్న పవన్ కళ్యాణ్ ను చూసేందుకు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో పలుచోట్ల కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు.పవన్ కళ్యాణ్ తాడేపల్లి కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

Tags: Deputy CM Pawan Kalyan visits AP for the first time after surgery.