July 20, 2026
Explore
లోక్‌సభలో వైసీపీ వాయిదా తీర్మానం

లోక్‌సభలో వైసీపీ వాయిదా తీర్మానం

July 20, 2026 | Andhra Pradesh


ఢిల్లీ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న కస్టోడియల్ మరణాల అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రయత్నించింది. ఈ మేరకు లోక్‌సభలో సోమవారం వైసీపీ ఎంపీ గురుమూర్తి వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు. గాదె సాయికృష్ణ, ఏడుకొండలు, మాల గంగమ్మ, క్రాంతికుమార్, హుస్సేన్ మరణాలపై చర్చ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి, సమగ్ర విచారణకు చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.

Tags: YCP Adjournment Motion in Lok Sabha