July 20, 2026
Explore
‘తల్లికి వందనం’ కోసం దేవదాయ శాఖ నిధులు.. ఉత్తర్వులు జారీ

‘తల్లికి వందనం’ కోసం దేవదాయ శాఖ నిధులు.. ఉత్తర్వులు జారీ

July 20, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ‘తల్లికి వందనం’ లబ్ధిదారులకు చెల్లించేందుకు దేవదాయ శాఖ నుంచి రూ.26.03 కోట్లు విడుదల చేసేందుకు పరిపాలన అనుమతులిస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్రహ్మణ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే తల్లికి వందనం లబ్ధిదారులకు డబ్బులు చెల్లించేందుకు ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు సంబంధించి పీడీ అకౌంట్‌లో నిధులు జమ చేసేందుకు దేవదాయ శాఖ కమిషనర్ తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, ఈ నెల 22 నుంచి తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేయనున్న విషయం తెలిసిందే.

Tags: Endowments Department funds for ‘Thalliki Vandanam’… Orders issued.