July 20, 2026
Explore
పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి.. 10 మంది జూదరుల అరెస్టు

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి.. 10 మంది జూదరుల అరెస్టు

July 20, 2026 | Andhra Pradesh

సంబేపల్లె ముచ్చట్లు:

సంబేపల్లె మండలం గున్నికుంట్ల పరిసరాల్లో పేకాట స్థావరంపై స్థానిక పోలీసులు, ఎస్‌బీ పోలీసులతో కలిసి ఆదివారం మెరుపుదాడి నిర్వహించారు. ఈ దాడిలో 10 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు.

దాడి సమయంలో మరికొందరు పేకాటరాయుళ్లు పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ.50,180 నగదు, 7 సెల్‌ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags: Police raid gambling den; 10 gamblers arrested.