అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా పరిధిలో జప్తు చేసి మండల స్థాయి గోదాముల్లో నిల్వ ఉంచిన 213.201 మెట్రిక్ టన్నుల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని ఈ నెల 24న బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు సంయుక్త కలెక్టర్ కార్యాలయంలో ఈ వేలం నిర్వహించబడుతుంది. జిల్లాలోని 9 మండల స్థాయి గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని వేలంలో పాల్గొనదలచిన వారు కార్యాలయ పని దినాల్లో, వేలానికి ముందు రోజు వరకు సంబంధిత గోదాముల్లో పరిశీలించవచ్చు.
వేలం ప్రక్రియ సంయుక్త కలెక్టర్ తుది నిర్ణయానికి లోబడి ఉంటుంది. పూర్తి వివరాల కోసం జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయం, మదనపల్లెను లేదా 9121456737 సెల్ నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
Tags: Public auction of PDS rice on July 24