లక్కిరెడ్డిపల్లె ముచ్చట్లు:
లక్కిరెడ్డిపల్లె మండలానికి చెందిన జడ్పీటీసీ సభ్యురాలు అంబాబత్తిన రమాదేవి, ఆమె భర్త మాజీ ఎంపీపీ అంబాబత్తిన రెడ్డెయ్య శనివారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మండలంలోని దప్పేపల్లె పంచాయతీ జాండ్రపల్లె గ్రామానికి చెందిన సుమారు 150 కుటుంబాలు కూడా వైకాపాను వీడి టీడీపీలో చేరాయి.
ఈ సందర్భంగా మంత్రి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం రమాదేవి, రెడ్డెయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు తెలిపారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. అలాగే వైకాపాలో తమకు తగిన గౌరవం లభించకపోవడం కూడా పార్టీ మారడానికి ఒక కారణమని పేర్కొన్నారు.
Tags: YCP leaders join TDP; 150 families switch parties.