మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె పట్టణ శివారులోని మడికయ్యల యోగభోగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తుల ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యూట్యూబర్, స్ట్రీట్ ఫొటోగ్రాఫర్ మనోజ్‌పై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయంలో మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రొఫెషనల్ కెమెరాతో భక్తుల వీడియోలు చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌గా పోస్టు చేశాడని భక్తుడు విజయ్‌కుమార్ ఫిర్యాదు చేశారు.
ఈ చర్యలు ఆలయ పవిత్రత, మత విశ్వాసాలు, మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు రూరల్ ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.
Tags: Case registered against YouTuber over videos of women at temple.