July 19, 2026
Explore
స్వార్థపరులు పార్టీని వీడితే వైఎస్సార్‌సీపీకి నష్టం లేదు: గడికోట

స్వార్థపరులు పార్టీని వీడితే వైఎస్సార్‌సీపీకి నష్టం లేదు: గడికోట

July 19, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

స్వార్థపరులు పార్టీని వీడితే వైఎస్సార్‌సీపీకి ఎలాంటి నష్టం లేదని, కష్టకాలంలో పార్టీని నమ్మి నిలిచిన కార్యకర్తలే అసలైన బలమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

రాజకీయాల్లో పార్టీలు మారడం గొప్ప విషయం కాదని, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం చేసిన అభివృద్ధే నిజమైన కొలమానమని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలు, బీసీలు, మైనార్టీల సాధికారతకు జగన్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. పార్టీ ద్వారా పదవులు, గౌరవాలు పొందిన కొందరు అధికారం లేకపోవడంతో పార్టీని వీడుతున్నారని, అలాంటి వారితో పార్టీ బలహీనపడదన్నారు.

గ్రామస్థాయి నుంచి నిబద్ధత కలిగిన కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దే శక్తి వైఎస్సార్‌సీపీకి ఉందని, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడమే రాజకీయాల అసలు లక్ష్యమని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags: YSRCP suffers no loss if self-serving individuals leave the party: Gadikota