July 19, 2026
Explore
వర్షాలు కురవాలని ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు

వర్షాలు కురవాలని ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు

July 19, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానంలో ఆదివారం ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వర్షాలు కురిసి పంటలు సస్యశ్యామలం కావాలని, తాగునీటి కొరత తొలగాలని ఆకాంక్షించారు. నీటి ప్రతి చుక్కను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, నీటి వృథాను నివారిస్తూ ప్రకృతి పరిరక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Tags: Special prayers by Muslim brethren for rain.