July 19, 2026
Explore
మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

July 19, 2026 | Andhra Pradesh

బి.కొత్తకోట ముచ్చట్లు:

బి.కొత్తకోట మండలంలోని మొగసాలమర్రి వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

స్థానికుల వివరాల ప్రకారం.. బి.కొత్తకోట నుంచి మదనపల్లెకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కాండ్లమడుగు నుంచి వులవలపల్లెకు వెళ్తున్న ఆటోను మొగసాలమర్రి వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ విశ్వనాథ్ (40) తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే ఆయనను మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: RTC bus and auto-rickshaw collide near Mogasalamarri; driver sustains severe injuries.