July 14, 2026
Explore
రేషన్ దుకాణాల్లో మినీ మార్టులు

రేషన్ దుకాణాల్లో మినీ మార్టులు

July 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రేషన్ దుకాణాల్లో మినీ మార్టుల ఏర్పాటుకు అనుమతిస్తూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత గుంటూరు జిల్లాలోని 10 రేషన్ దుకాణాలను ఫ్రాంటియర్ మార్కెట్స్ సంస్థ ఆధ్వర్యంలో మినీ మార్టులుగా ఆధునికీకరించనున్నారు. జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (NCCF), పౌర సరఫరాల శాఖ మధ్య గతంలో మినీ మార్టుల ఏర్పాటుపై ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 533 రేషన్ దుకాణాల్ని మినీ మార్టులుగా మార్చాలని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో గుంటూరు జిల్లాలో 125, ఎన్టీఆర్-93, కృష్ణా-152, ఏలూరులో 163 చొప్పున ఉన్నాయి.

Tags: Mini-marts in ration shops