పల్నాడు ముచ్చట్లు:
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 100 ఎంబీబీఎస్ సీట్లకు జాతీయ మెడికల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కళాశాల భవన నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు, ఆసుపత్రికి అవసరమైన వైద్యులు, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్ల ఎంపిక కూడా పూర్తవుతోంది. ఈ వార్త పల్నాడు వాసులకు ఆనందాన్ని కలిగించింది.
Tags: Large number of seats sanctioned for Piduguralla Medical College.