July 8, 2026
Explore
ఆస్తి వివాదంలో బాబాయ్‌ను నరికి చంపిన అన్న కొడుకు

ఆస్తి వివాదంలో బాబాయ్‌ను నరికి చంపిన అన్న కొడుకు

July 8, 2026 | Andhra Pradesh

ఏలూరు జిల్లా ముచ్చట్లు:

జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో ఆస్తి వివాదాల నేపథ్యంలో కరుమూరి దుర్గారెడ్డి పట్టపగలే దారుణ హత్యకు గురయ్యారు.

ఆయన సోదరుడి కుమారుడు కరుమూరి శ్రీనివాసరెడ్డి, అనుచరులు కలిసి మారణాయుధాలతో దాడి చేసి విచక్షణారహితంగా నరికి చంపినట్లు సమాచారం.

ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని, నిందితుల కోసం గాలిస్తున్నారు.

నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

Tags: Nephew hacks uncle to death over property dispute.