అమరావతి ముచ్చట్లు:
దాదాపు పదేళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక హామీ ఇచ్చింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో న్యాయపరమైన చిక్కులను వేగంగా పరిష్కరించి, వచ్చే ఆరు నెలల్లో ఆస్తుల వేలం ద్వారా బాధితులకు డబ్బులు చెల్లించేలా కార్యాచరణ చేపడుతున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. సమస్య పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రతి 15 రోజులకోసారి మంత్రుల కమిటీ సమావేశమై పురోగతిని సమీక్షించాలని నిర్ణయించింది.
Tags: Justice for AgriGold victims within six months: Cabinet sub-committee