July 8, 2026
Explore
కుటుంబ కలహాలతో ట్రావెల్స్ నిర్వాహకుడు బలవన్మరణం

కుటుంబ కలహాలతో ట్రావెల్స్ నిర్వాహకుడు బలవన్మరణం

July 8, 2026 | Andhra Pradesh

కేవీపల్లె ముచ్చట్లు:

కేవీపల్లె మండలం కలికిరివాండ్లపల్లె సమీపంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ట్రావెల్స్ నిర్వాహకుడు హరినాథబాబు (38) బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్కిరెడ్డిపల్లెకు చెందిన హరినాథబాబు తిరుపతిలో ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు. సోమవారం భార్యతో గొడవపడిన అనంతరం ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు.

మార్గమధ్యంలో కలికిరివాండ్లపల్లె సమీపంలో రోడ్డు పక్కన వాహనం ఆపి పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం రోడ్డు పక్కన ఆయన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ వెంకటశివకుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags: Travel agency operator dies by suicide due to family disputes.