July 8, 2026
Explore
గంజాయి, మైనర్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలి

గంజాయి, మైనర్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలి

July 8, 2026 | Andhra Pradesh

గుర్రంకొండ ముచ్చట్లు:

గుర్రంకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్‌ఐ రవీంద్ర విద్యార్థులకు గంజాయి, ఈవ్‌టీజింగ్, మైనర్ డ్రైవింగ్‌పై అవగాహన కల్పించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలైతే బంగారు భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు.

మైనర్ డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈవ్‌టీజింగ్ లేదా ఇతర వేధింపులు ఎదురైతే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. విద్యార్థులు చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

Tags: Stay away from marijuana and underage driving.