రాయచోటి ముచ్చట్లు:
రాయచోటిలో ఐడియల్ మైనారిటీ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మైనారిటీ టెట్ అభ్యర్థులకు ఉచిత టెట్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కొండూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ, పోటీతత్వంతో చదివినప్పుడే ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని అన్నారు. సరైన ప్రణాళిక, సమయపాలన, నిరంతర సాధనతో టెట్‌లో మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు.
డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఉర్దూ మాధ్యమ టెట్ అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత స్టడీ మెటీరియల్ అందించడం అభినందనీయమన్నారు. గత ఐదేళ్ల ప్రశ్నాపత్రాలను సాధన చేయడం ద్వారా పరీక్షలో మెరుగైన ప్రతిభ కనబరచవచ్చని వివరించారు.
Tags: Success comes only when studying with a competitive spirit.