అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ ఏడాది మార్చిలో టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థుల మార్కుల జాబితా, టీసీ వివరాల సవరణకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు (హెచ్ఎంలకు) మరో అవకాశం కల్పించినట్లు అన్నమయ్య జిల్లా డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు.
నేటి నుంచి ఈనెల 10వ తేదీ వరకు పాఠశాల లాగిన్‌లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థుల పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల వివరాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, తల్లిదండ్రులతో ధ్రువీకరించిన అనంతరం అవసరమైన సవరణలు చేయాలని సూచించారు.
నిర్దేశిత గడువులోపు అన్ని మార్పులు పూర్తి చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్ఎంలను డీఈవో కోరారు.
Tags: Another opportunity for Headmasters to correct 10th-grade certificates: DEO