పీలేరు ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాల కోసం ఈ నెల 13, 14 తేదీల్లో తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్ నారాయణ తెలిపారు. పీలేరులోని ఆయిల్ సీడ్స్ ప్రాంగణంలోని ప్రభుత్వ ఐటీఐలో కౌన్సెలింగ్ జరుగుతుంది. 13న మెరిట్ నెంబర్లు 588–300 మార్కులు, 14న 299–251 లేదా అంతకంటే తక్కువ మార్కులు వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
అభ్యర్థులు SSC మార్కుల మెమో, టీసీ, స్టడీ సర్టిఫికెట్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్‌లతో నిర్ణీత సమయానికి హాజరు కావాలని అధికారులు సూచించారు.
ఐటీఐ విద్య ద్వారా మంచి ఉపాధి అవకాశాలు ఉన్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Tags: First phase of ITI counseling on the 13th and 14th.