June 30, 2026
Explore
పరాయి మోజులో పడి.. రుబ్బురాయితో భర్తను హతమార్చిన భార్య!

పరాయి మోజులో పడి.. రుబ్బురాయితో భర్తను హతమార్చిన భార్య!

June 30, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే నెపంతో, ప్రియుడితో కలిసి భార్యే భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఉదంతం మదనపల్లెలో వెలుగుచూసింది. ఈ ఘాతుకానికి సంబంధించిన వివరాలను జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి మంగళవారం మీడియాకు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. నారమాకుల తండాకు చెందిన చిన్నబుడ్డన్ననాయక్ భార్య రమీల, అదే ఊరిలో నివసించే రెడ్డప్పనాయక్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త చిన్నబుడ్డన్ననాయక్‌కు తెలియడంతో ఆయన భార్య ప్రవర్తనను తీవ్రంగా మందలించాడు.

దీంతో భర్తను వదిలించుకోవాలని పథకం వేసిన రమీల, ఈనెల 18వ తేదీ రాత్రి తన ప్రియుడు రెడ్డప్పనాయక్‌తో కలిసి నిద్రిస్తున్న భర్త తలపై రుబ్బురాయితో బలంగా మోది హత్య చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags;Wife kills husband with a grinding stone, driven by infatuation for another man!