రాయచోటిముచ్చట్లు:
రాయచోటి మార్కెట్ యార్డ్‌లోని ఈవీఎం గోదామును మంగళవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జరిగిన ఈ మాసవారీ తనిఖీలో గోదాము భద్రతను, బీయూ, సీయూ, వీవీ ప్యాట్ యంత్రాలను ఆయన తనిఖీ చేశారు. గోదాము వద్ద 24/7 నిరంతరం పటిష్టమైన పోలీస్ నిఘా ఉండాలని అధికారులను ఆదేశించారు. పార్టీల ప్రతినిధుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు.
Tags: Collector inspected the EVM warehouse.