June 30, 2026
Explore
పోలీసు వృత్తిలో అంకితభావమే నిరంతర ప్రేరణ: ఎస్పీ

పోలీసు వృత్తిలో అంకితభావమే నిరంతర ప్రేరణ: ఎస్పీ

June 30, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

దశాబ్దాల పాటు క్రమశిక్షణ, అంకితభావంతో పోలీస్ శాఖలో సేవలందించి పదవీ విరమణ పొందిన అధికారులు ఆదర్శనీయులని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ పేర్కొన్నారు. జూన్ నెలాఖరుతో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలు జె.ఎన్.ఎ. బాషా, మోసెస్, హెడ్ కానిస్టేబుల్ మదన మోహన్ రెడ్డిలకు మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఘనంగా వీడ్కోలు సన్మానం చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 1984లో పోలీస్ శాఖలో చేరి, శాంతిభద్రతల పరిరక్షణలో వీరు అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు. విశ్రాంత ఉద్యోగుల బెనిఫిట్స్ త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని, ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags: Dedication is the constant source of inspiration in the police profession: SP