పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు నుంచి చెరువు కట్టపై బెంగళూరుకు వెళ్లే రహదారి పనులు అసంపూర్తిగా వదిలియేయడంతో ప్రజా సంఘాల నాయకులు వెంకట్రమణారెడ్డి, రామమూర్తి, మున్న లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వారు మాట్లాడుతూ నిత్యం ఈ రహదారిలో వందలాది వాహనాలు ప్రయాణిస్తు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నెల రోజులుగా ఆర్‌అండ్‌బి అధికారులకు తెలియజేసిన నామమాత్రపు పనులతో కాలయాపన చేస్తున్నారని, శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం లోపు రోడ్డు పనులు పునఃప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ దీక్షకు నియోజకవర్గంలోని ప్రజలు, వాహనదారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు తరలిరావాలని కోరారు.
Tags: Peaceful protest for road repairs