June 30, 2026
Explore
భవన కార్మికులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి

భవన కార్మికులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి

June 30, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

కార్మికులు గుర్తింపు కార్డుకు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని లేబర్‌ ఆఫీసర్‌ ఎలిజబెత్‌మార్గరెట్‌ తెలిపారు. మంగళవారం జెడ్పి అతిధిగృహంలో నియోజకవర్గ స్థాయి భవన కార్మికులతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మిక చట్టాలు గురించి అవగాహన కల్పించారు. ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు అందాలంటే తప్పనిసరిగా గుర్తింపు కార్డు ఉండాలన్నారు. కార్మికులకు మార్చి నుంచి నాలుగు పథకాలు అమల్లోకి వచ్చినట్లు ఆమె తె లిపారు. నియోజకవర్గంలోని భవన నిర్మాణరంగంలో పనిచేసే 18నుంచి 60 సంవత్సరాల లోపు వయసు కలిగిన కార్మికులందరు దగ్గరలోని కార్మికశాఖ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకుని గుర్తింపు కార్డులు పొందాలని తెలిపారు. ప్రస్తుతం గుర్తింపు కార్డు కలిగిన భవన నిర్మాణ కార్మికులు ఆ కార్డును నవీకరించుకోవాలని కోరారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు అందజేసే సంక్షేమ పథకాలకు ఈ కార్డు కలిగిన కార్మికులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంఘ అధ్యక్షుడు కేశవరెడ్డి, మురుగప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags: Identity cards are mandatory for construction workers.