పుంగనూరుముచ్చట్లు:
చట్టాలపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని సీఐ సుబ్బరాయుడు సూచించారు. మంగళవారం పట్టణంలోని కొత్తయిండ్లు మున్సిపల్ పాఠశాలలో హెచ్‌ఎం ఉషారాణితో కలసి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎఫ్‌ఐఆర్, సివిల్, క్రిమినల్ చట్టాల మధ్య తేడాలు, బెయిల్ అంటే ఏమిటి.? అనే అంశాలతో పాటు పోక్సోచట్టం, బాల్యవివాహాలు, రోడ్డు ప్రమాదాలు , సైబర్ క్రైమ్‌వంటి అంశాలపై అవగాహన, గుడ్‌టచ్ బ్యాడ్‌టచ్, డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాల వలన కలిగే అనర్థాలు గురించి వివరించారు. అలాగే మైనర్లు వాహనాలను నడపరాదని సూచించారు. ప్రతి విద్యార్థి చట్టాల పట్ల అవగాహన కలిగి ఉంటేనే వారు మంచి పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజా, మాలతి, జ్యోతి, శ్రీరాములురెడ్డి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags: One must be aware of the laws – CI Subbarayudu