తిరుపతి ముచ్చట్లు:
- తప్పిపోయిన వృద్ధురాలిని కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించిన చంద్రగిరి పోలీసులు.
- సమయస్ఫూర్తితో స్పందించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు,., అభినందనలు.
- తిరుమల పర్యటనలో కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయిన తెలంగాణకు చెందిన వృద్ధురాలు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన పంజా లక్ష్మవ్వ (68) అలిపిరి వద్ద కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోవడంతో, సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా తమ సంరక్షణలోకి తీసుకున్నారు.
వృద్ధురాలు తెలిపిన వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులను గుర్తించి, అవసరమైన ధృవీకరణ అనంతరం ఆమెను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. తమ కుటుంబ సభ్యురాలిని సురక్షితంగా చేర్చిన చంద్రగిరి పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సమయస్ఫూర్తితో స్పందించి మానవత్వంతో సేవలందించిన చంద్రగిరి పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ, ప్రజలకు ఇదే సేవా దృక్పథంతో అండగా నిలవాలని సూచించారు.
Tags: Police handed over the elderly woman to her family members.