అమరావతిముచ్చట్లు:
పారా ఒలింపిక్స్‌లో ప్రతిభ కనబర్చి, మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన 15 మంది దివ్యాంగ క్రీడాకారులకు నిర్వహించిన సన్మాన సభ. ఈ సన్మాన సభ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది.ఈ సభకు ముఖ్య అతిథులుగా కృష్ణా జిల్లా కలెక్టర్ , ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షిబ్లీ , కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఫరూఖ్ షిబ్లీ మాట్లాడుతూ… “పిల్లలకు విద్యతో పాటు క్రీడలు, ఒక మంచి ఆశయం, ఉన్నతమైన లక్ష్యాన్ని కూడా నేర్పించాలి” అని అన్నారు. అలాగే డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన దివ్యాంగ ఉపాధ్యాయులు విద్యతో పాటు పిల్లలకు ఆత్మ విశ్వాసాన్ని మీరే నూరిపోయాలని అన్నారు, మరియు “మీ సంకల్పం ముందు మామూలు మనుషులు కూడా ఓడిపోతారు. మీ సంకల్పమే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది.” అని వారిని అభినందించారు.
ఈ సందర్భంగా చిత్తశుద్ధితో దివ్యాంగుల దీవెనలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం మరల 2029 ఎన్నికల్లో ఢంకా మోగిస్తుందని వారందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
Tags: Children need sports along with education.