June 30, 2026
Explore
తిరుమలలో శాంతిభద్రతల పరిరక్షణ కు ప్రత్యేక చర్యలు

తిరుమలలో శాంతిభద్రతల పరిరక్షణ కు ప్రత్యేక చర్యలు

June 30, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • – అలవాటు పడ్డ నేరస్థుడు గోగుల కోటయ్య @ కోటిపై పీడీ యాక్ట్ అమలు.
  • జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ప్రతిపాదనల మేరకు జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ నిర్బంధ ఉత్తర్వులు.
  • తిరుమల లో పదే పదే నేరాలకు పాల్పడుతున్న వ్యక్తి పైన PD యాక్ట్ నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలింపు.
  • తిరుమల పవిత్రతకు భంగం కలిగించే, భక్తులను వేధించే, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించే వారిపై ప్రత్యేక దృష్టి.
  • చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు.
  • తిరుమల, తిరుపతి లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే మున్ముందు మరింత కఠిన చర్యలు.

తిరుమలలో భక్తులను బెదిరిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, పోలీసు మరియు టీటీడీ సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్న అలవాటు నేరస్థుడు గోగుల కోటయ్య @ కోటి (22)పై ఆంధ్రప్రదేశ్ ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు అమలయ్యాయి.

జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ప్రతిపాదనల మేరకు జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ నిందితుడి నేరచరిత్రను పరిశీలించి, ప్రజా శాంతి భద్రతలకు, ముఖ్యంగా తిరుమలకు వచ్చే భక్తుల భద్రతకు ముప్పుగా ఉన్నట్లు నిర్ధారించి పీడీ యాక్ట్ కింద ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు నిందితుడిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు.తిరుమలలో రౌడీయిజం, గూండాయిజం, భక్తులను వేధించడం, అక్రమ కార్యకలాపాలు, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు కొనసాగుతాయని తిరుపతి జిల్లా పోలీసులు హెచ్చరించారు.

Tags; Special measures to maintain law and order in Tirumala