-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతిముచ్చట్లు:
- ఇప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బ తినడంతో ఆ పాపాన్ని వైసీపీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు
- వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల అధికారంలో దాదాపు 20 కోట్ల రూపాయలు మల్లయ్య కొండ అభివృద్ధికి కృషి చేసింది. టిడిపి పాలనలో ఒక్క పైసా అభివృద్ధి ఎందుకు చేయలేదు?.
- గతంలో కాలిబాట కూడా సరిగ్గా లేని పరిస్థితి నుండి ఆలయ జీర్ణోద్ధరణ చేసి, రోడ్లు వేసి, విద్యుత్ సరఫరా, మంచినీరు, ఇతర సదుపాయాలు అందించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.
- 2022 లో ఎర్రకొండలో మైనింగ్ కు సంబంధించి కేంద్రం నుండి అనుమతులు వచ్చిన మాట వాస్తవమే
- అయినా కూడా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఎర్రకొండలో మైనింగ్ అనుమతులు ఉన్నా కూడా మేము ఆ ప్రక్రియ కొనసాగించలేదు.
- అనుమతులు వచ్చినా మైనింగ్ చేయకూడదు అని నిర్ణయించాం, పూర్తి గా నిలిపివేశాం.
- కానీ మేం ఆపేసిన ఎర్రకొండ అనుమతులు చూపించి, ఏకంగా ఆ శివుడు కొలువై ఉన్న సాధు కొండ, శివపురం లో మైనింగ్ కు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది
- సాధు కొండలో మైనింగ్ గురించి 2004 జనవరి 1 నుండి జియోమైసూర్ సర్వీసెస్ అనే సంస్థ ప్రభుత్వం తో అనేకమార్లు సంప్రదింపులు జరిపింది
- అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే…
- ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు మళ్ళీ జియో మైసూర్ సంస్థ అనేక లేఖలు ప్రభుత్వానికి రాసింది
- కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తంబళ్లపల్లె స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆ ప్రాంతంలో మైనింగ్ జరిగితే ప్రజలతో పాటుగా తాను వ్యతిరేకిస్తాను అని స్వయంగా అప్పటి మైనింగ్ మంత్రి గల్లా అరుణ కుమారి కి చెప్పారు
- ఈ విషయం నేను చెప్పట్లేదు….. స్వయంగా గల్లా అరుణ కుమారి గారు ఈ అంశాన్ని ఆమె పుస్తకంలో రాసుకున్నారు.
- 2015 లో ప్రాస్పెక్టింగ్ లైసెన్స్…. అంటే ఖనిజాలు గుర్తించేందుకు లైసెన్స్ ఇచ్చారు. అప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే
- సాధు కొండ, శివపురం టెండర్లు ఇచ్చింది ఈ జనవరిలో, కాంపోజిట్ లైసెన్స్ ఇచ్చింది ఈ ఏడాదిలోనే
- వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసిన ఎర్రకొండ కు ఎల్.సి ఇచ్చింది ఈ నెల 23న కాదా? దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి
- సాధుకొండకు కూటమి ప్రభుత్వం 2025 నవంబర్ 27న టెండర్ పిలిచారు
- ఏపీఎండీసీ దాఖలు చేసిన టెండర్ కు ప్రిఫర్ బిడ్డర్ కింద 900 హెక్టార్లలో ఈ ఏడాది ఏప్రిల్ 23న ఎల్.సి జారీ ఎలా చేశారు
- శివపురం లో 626 హెక్టార్లలో మైనింగ్ కోసం 2025 ఫిబ్రవరి 27, సెప్టెంబర్ 4న ఉన్నత స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించి కూటమి ప్రభుత్వమే.
- ఆ సమావేశాల్లో నిర్ణయం మేరకు శివపురం లో మైనింగ్ కు టెండర్ పిలిచి, 2026 మార్చి 30న సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్ కు ఎల్.సి జారీ చేశారు
- భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిపేసిన ఎర్రకొండ మైనింగ్ ను మళ్ళీ కూటమి ప్రభుత్వం ప్రారంభించింది
- 2025 మార్చి 10న ఎర్రకొండకు సంబంధించి 300 హెక్టార్లలో మైనింగ్ కు టెండర్లు పిలిచారు
- ఈ నెల 23న ఆర్కే ఎర్త్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఎల్.సి జారీ చేసింది కూటమి ప్రభుత్వం కాదా ?
- మైనింగ్ పేరుతో మొత్తం మల్లయ్య కొండను దోచేయాలి అని కూటమి ప్రభుత్వం చూస్తుంది అనడానికి ఇంతకంటే ఏం ఆధారాలు కావాలి ?
- భక్తుల మనోభావాలతో మైనింగ్ అనుమతులు ఉన్నా మేము ముందుకు పోలేదు… ఆ అనుమతులను వాడుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు మైనింగ్ కు సిద్ధం అయ్యారు
- ఇకనైనా వైసీపీ పై తప్పుడు ప్రచారాలు చేయడం మాని, ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరుతున్నాం
- ఒకవేళ అక్కడ మైనింగ్ కు యత్నిస్తే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది
- దొంగే దొంగ దొంగ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మైనింగ్ కు పూనుకుని మాపై విమర్శలు చేస్తుంది
- తిరుమల 7 కొండలు లానే మల్లయ్య కొండ మూడు కొండలు పవిత్రమైనవి
- మల్లయ్య కొండ జోలికి వెళితే భక్తులు ఊరుకోరు
- రాష్ట్రంలో మామిడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు
- పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక్క కేంద్రం మంత్రి ఉన్నా అక్కడ మామిడికి 17 రూపాయల మద్దతు ధర ఉంది
- చంద్రబాబు కు రైతులు అంటే ఎప్పుడూ ఇష్టం లేదు
- రాష్ట్రంలో పాలన లేదు, కేవలం కేసులు పెట్టడం, టార్చర్ చేయడం, గోర్లు పీకేయడం, చంపేయడమే జరుగుతుంది
Tags: The alliance government has set in motion the plundering of iron ore at Mallayya Konda.