తప్పుడు సర్వే నెంబర్ లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ అధికారులు
మైనార్టీ ఆస్తుల అన్యకాంతానికి అధికారులే బాధ్యత వహించాలి….
కొండపల్లి 293 సర్వేనెంబర్ రిజిస్ట్రేషన్ అందుకు ఉదాహరణ…
ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షులు అల్తాఫ్ బాబా
కొండపల్లి ముచ్చట్లు:
కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వందల ఎకరాల వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అవ్వడానికి కారణం వివిధ శాఖల అధికారులే అని, ముఖ్యంగా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అధికారుల ప్రధాన బాధ్యత ఉందని ఆరోపించారు
ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షులు అల్తాఫ్ బాబా.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ ఆస్తులను అక్రమదారులకు సహకరిస్తున్న అధికారులు మైనార్టీ ద్రోహులుగా మిగిలి పోవడం తథ్యం అన్నారు.
కేవలం అధికారుల నిర్లక్ష్యం, ధన దాహం వలన మాత్రమే వలనే వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపించారు. స్థానిక రెవెన్యూ, ఇతర అధికారులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారని, డబ్బుల కోసం ఎన్వోసీ లు, పన్నులు సృష్టించి అక్రమార్కులకు సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వీటి ఆధారాలతో అసలు సర్వే నెంబర్ వదిలేసి, తప్పుడు సర్వే నెంబర్లతో సబ్ రిజిస్టర్ కార్యాలయం అధికారులు రిజిస్ట్రేషన్ చేసి మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.
కొండపల్లి మున్సిపాలిటీలోని వక్ఫ్ బోర్డ్ భూములు సర్వే నెంబర్ లు మార్చి రిజిస్ట్రేషన్లు చేసిన దాఖలాలు వందలు సంఖ్యలో పత్రాలు ఉన్నాయని,కొండపల్లి హజరత్ ముర్తుజా అలీ పంజా సర్వే నెంబర్ 293 పీర్ల పంజా ను 2009లో తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారని, వక్ఫ్ బోర్డ్ అధికారులు ఫిర్యాదుతో రెవెన్యూ వారు డాక్యుమెంట్ పరిశీలించగా ఎక్కడో సర్వే నెంబర్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని అది చల్లదని అధికారులు నోటీస్ ఇచ్చి తదుపరి కోర్టులో కేసు నడుస్తుండగా చాలా తెలివిగా గ్రామ కంఠం సాగు చూపించి రెండు నెలల కిందట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, మదర్ డాక్యుమెంట్ తప్పు ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు రిజిస్టర్ పై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోకపోతే న్యాయం కోసం న్యాయపోరాటం తప్పదని హెచ్చరించారు.
వక్ఫ్ బోర్డ్ ఆస్తులలో పన్నులు వేయడానికి, ఎన్ ఓ సి లు ఇవ్వడానికి, తప్పుడు రిజిస్ట్రేషన్ చేయటం కోసమే ఉద్యోగంలోకి చేరారా..?డాక్యుమెంట్ రైటర్ అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతూ మైనార్టీ ఆస్తులు ఇష్టానుసారంగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే మైనార్టీలు ఎవరు ప్రశ్నించరు అనే ధీమాతో ఉన్నారా?ఇది తప్పు అని నిలదీస్తే తప్పుడు ప్రచారాలు మత కలహాలు దుష్ప్రచారం చేయటం అత్యంత బాధాకరం.
_అధికారులకు ఖబర్దార్ వక్ఫ్ బోర్డ్ ఆస్తులు జోలికి వస్తే ఉన్నత న్యాయస్థానం హైకోర్టు సుప్రీంకోర్టు వరకు న్యాయం కోసం పోరాటం చేసి తప్పు చేసిన అధికారులను కోర్టులో దోషిగా నిలబెడతాం అని అన్నారు.
అమాయక ప్రజల్లారా దయచేసి మోసపోకండి వక్ఫ్ బోర్డు ఆస్తులలో ఎవరైనా కొనుగోలు చేస్తే వారు ఇబ్బంది పడటం ఖాయం ఆ మహనీయుల ఆస్తులు కాపాడుకోవడానికి తుది శ్వాస వరకు పోరాటం చేస్తాం.
కొండపల్లి లో పంజాలు దర్గాలు స్మశాన వాటికలు ఖాజీమాన్యాలు ఎవరైనా ఆక్రమించి కొనుగోలు చేసి ఉంటే తస్మాత్ జాగ్రత్త ఎవరిని వదిలే ప్రసక్తే లేదు న్యాయపోరాటం చేస్తాం ఆ మహనీయుల ఆస్తులు కాపాడుకుంటాం ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని. అల్తాఫ్ అలీ రజా తెలిపారు.
Tags: Officials are responsible for the alienation of Waqf Board lands.