.. ఇక సమస్యలు కి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు!
అమరావతిముచ్చట్లు:
ఏపీ ప్రభుత్వం మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు వేగవంతంగా పౌర సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.
ఇకపై ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వ ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. వాట్సప్ ద్వారా సులువుగా ఫిర్యాదు చేయవచ్చు. వాయిస్ మెస్సేజ్ రూపంలో వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించనున్నారు. త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సోమవారం ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక నుంచి మీరు గ్రీవెన్స్ సెల్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సప్ ద్వారా సులభంగా మీ సమస్యను వివరించవచ్చు. ఈ మేరకు కొత్త వ్యవస్థపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. వీలైనంత త్వరగా ఈ సదుపాయాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీని వల్ల ప్రజలు సమయం, డబ్బులు ఆదా కానున్నాయి.
తాజాగా ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి ప్రభుత్వ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.
వాయిస్ మెస్సేజ్‌ల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించాలని, వీటిన కూడా స్వీకరించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
Tags: The alliance government has shared fantastic news with the people of AP.