బెంగళూరుముచ్చట్లు:
…. కని, పెంచి, పెద్దచేసేది మనమే…..అలాంటి విధానంలో ఆడ పిల్లలు ఏమి చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు… ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు.
అనేది కూడా గమనించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులు కు ఉండాలి…..ఉన్నత చదువులు కోసం కాలేజీలకు పంపినప్పుడు …ఆ కాలేజీలు పిల్లల పట్ల శ్రద్ద వహిస్తున్నారా లేదా అనేది ఆలోచన చేయాలి…లేదా పిల్లలు పక్క దోవ పెట్టె అవకాశాలు మెండు గా ఉంటాయి….ఆ సమయంలో లొనే పిల్లల ప్రవర్తన మారుతుంది…లవ్వు,గివ్వు అనే పోకడికి రెడీ అవుతారు….మనకు తెలియకుండా నే….నమ్మిన వాడి చేతిలో ప్రాణాలు కోల్పోతారు….!*
ఘటన ఎక్కడ అనేది కాదు…ఈ రోజుల్లో వ్యవస్థ పట్ల జాగ్రత్తగా ఉండాలి..ప్రతి ఒక్క తల్లిదండ్రులు
పెళ్లికి నిరాకరించిందని యువతి హత్య
బెంగళూరులోని మహాలక్ష్మి లేఔట్‌లో దారుణం చోటుచేసుకుంది.
రాజీవ్ అనే యువకుడు తనని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందని యువతి అంజలిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.
తల్లిదండ్రులు కి తెలియకుండా కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న వీరి పెళ్లికి అంజలి కుటుంబం నిరాకరించింది.
రాజీవ్ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ కారణంగా ఒప్పుకోలేదు.
దీంతో పగ పెంచుకున్న రాజీవ్, డిన్నర్‌కు పిలిచి గొడవపడి, కత్తితో దాడి చేశాడు.
స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అంజలి మృతి చెందింది.
పోలీసులు నిందితుడు రాజీవ్‌ను అరెస్ట్ చేశారు..అంజలి కుటుంబం శోకసంద్రంలో మునిగింది.
Tags: Parents of girls should note one thing.