June 30, 2026
Explore
ఏసిబికి చిక్కిన ఇరిగేషన్ ఏ ఈ ఈ

ఏసిబికి చిక్కిన ఇరిగేషన్ ఏ ఈ ఈ

June 30, 2026 | Andhra Pradesh

అశ్వారావుపేటముచ్చట్లు:

ఓ రైతు నుంచి రూ. 2.00 లక్షల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తూ ఇరిగేషన్ శాఖకు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) ఎల్. శ్రీనివాస్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

అశ్వారావుపేట మండలంలోని దొంతికుంట చెరువు నుంచి శిఖం భూమిలో మట్టి తోలుకునేందుకు అనుమతి కోసం ఓ రైతు ఇరిగేషన్ విభాగానికి చెందిన ఏఈఈ శ్రీనివాస్ ను సంప్రదించారు. ఇందుకు రైతు నుంచి ఆయా ఇంజనీర్ రూ. 4.00 లక్షల మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేశాడు. అయితే ఇంజనీర్ కు లంచం ఇవ్వడం ఇష్టం లేని రైతు ఏసీబీ అధికారులను సంప్రదించారు.

ఈమేరకు వలపన్నిన ఏసీబీ అధికారులకు ఏఈఈ శ్రీనివాస్ తన కార్యాలయంలోనే రూ.2 లక్షల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.

Tags: Irrigation caught by ACB