June 30, 2026
Explore
ప్రభుత్వ డబ్బును కాజేస్తున్న ఎంపీడీవో..

ప్రభుత్వ డబ్బును కాజేస్తున్న ఎంపీడీవో..

June 30, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కేసముద్రం మండలం ఎంపీడీవో కార్యాలయంలో రోజుకు ఒక అవినీతి

బయటపడుతుంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రికవరీ సుమారు 13 లక్షల రూపాయలను కాజే యడానికి ప్రయత్నిస్తున్న ఎంపీడీవో 15 ఫైనాన్స్లో వర్కులు చేసిన కాంట్రాక్టర్లకు ఎం.బి పరంగా వివిధ రకాల ప్రభుత్వానికి చెల్లించవలసిన కటింగ్ చేశారు. అందులో జీఎస్టీ, బటీ, క్యూసి, ఇ.ఎం.డీ ఫర్ క్యాష్ట, సీనియర్ ఏజ్ కటింగ్ చేసి మిగతా అమౌంట్ని కాంట్రాక్టర్కి చెల్లించారు. దీంట్లో ఇ.ఎం.డీ. కాంట్రాక్టర్ కి ఇవ్వవలసి ఉంటుంది. ఎప్పుడైతే ఒక పని పూర్తి అవుతుందో ఎం.బి చేసిన తర్వాత అ రికవరీ అమౌంట్, వివిధ శాఖలకు పంపించవలసి ఉంటుంది. కానీ అలా చేయకుండా ఎంపీడీవో తమ దగ్గరే ఉంచుకొని తన సాంతానికి వాడుకుంటున్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. మేము ఇప్పటికే అప్పు తీసుకొచ్చి పెట్టాము ఇ.ఎం.డీ పస్తే మా పెట్రోల్ ఖర్చులైనా వెళ్తాయి కదా అని చెబుతున్నారు.

ఆదర్శ పాఠశాలకు సంబంధించి…

ఇది ఇలా ఉంటే 2024 సంవత్సరంలో సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద కేసముద్రం మండలానికి ఫస్ట్ దఫా సుమారుగా 62 లక్షలు మరో దఫా 32 లక్షలు జిల్లా కలెక్టర్ గారి నుండి మంజూరైనట్లు తెలుస్తుంది. అప్పట్లో కాంట్రాక్టర్లు అనేక స్కూళ్లలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద వర్కులు చేసి ఎం.బీ చేయించుకొని జీఎస్టీ, ఐటీ, వివిధ రకాల కటింగ్ చేసిన తర్వాత మిగతా అమౌంట్ ని కాంట్రాక్టర్లకు ఇవ్వడం జరిగింది. లక్ష రూపాయల వర్క్ చేసినట్లయితే కటింగ్ తరువాత వారికి 70,000 నుంచి 80000 చేతికి వచ్చాయని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. ఈ అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించి రికవరీ అమౌంట్ అంతా కూడా డ్రాయింగ్ ఆఫీసర్ ఖాతాలో సుమారుగా 13 లక్షలు ఉన్నట్లు సమాచారం. ఇట్టి అమౌంటు ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది అడిగేది ఎవరూ లేరు అన్నట్టుగా ఎంపీడీవో ఆ 13 లక్షల నుండి తనకి ఇష్టం వచ్చినట్లు డబ్బులు డ్రా చేసుకుంటుంది. ఇదంతా ప్రభుత్వానికి మరియు కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన సొమ్ము.

Tags: MPDO siphoning off government funds…