June 30, 2026
Explore
విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ఎస్‌ఐ రవికుమార్

విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ఎస్‌ఐ రవికుమార్

June 30, 2026 | Andhra Pradesh

సంబేపల్లి ముచ్చట్లు:

సంబేపల్లి మండలం శెట్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, బాలికలకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, 112 అత్యవసర సేవలు, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. గ్రామాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Tags: Students should stay away from drugs: SI Ravikumar