జనసేన పార్టీ రాయచోటి నియోజకవర్గ నేత పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి
రాయచోటిముచ్చట్లు:
గ్రామ స్థాయి నుండి జనసేన పార్టీని బలోపేతం చేద్దామని జనసేన పార్టీ రాయచోటి నియోజకవర్గం నేత పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాయచోటి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని జనసేన పార్టీ రాయచోటి నియోజకవర్గ నాయకులు పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందులో భాగంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ తరపున శ్రీనివాసరావు విచ్చేసి అవగాహన కల్పించాలన్నారు.ఇందులో భాగంగానే సోమవారం రాయచోటి నియోజకవర్గం పరిధిలోని జనసేన నాయకులకు,కార్యకర్తలకు,వీర మహిళలకు పార్టీ నిర్మాణ సారథ్యం గురించి దిశా నిర్దేశం చేశారు.ఈ క్రమంలోనే రాయచోటి నియోజకవర్గం పరిధిలోని 6 మండలాల్లో జనసేన పార్టీ స్థాపించిన నాటి నుండి పని చేసిన నాయకులు కార్యకర్తలు,మధ్యలో పార్టీలో చేరి కష్టపడుతున్న వారు నియోజవర్గ స్థాయి జనసేన పార్టీ కార్యాలయంలో సంప్రదించి జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
అలాగే గ్రామపంచాయతీ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ, పార్లమెంట్ స్థాయిలలో పార్టీ కోసం కష్టపడి పని చేస్తూ పదవులు కావాలని ఆసక్తి కలిగిన జనసేన పార్టీ నేతలు,కార్యకర్తలు రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు రెడ్డి ప్రసాద్ నాయుడు, బుల్లెట్ విజయ్, నిమ్మనపల్లి పవన్ కుమార్, పద్మావతి, కొండ, వేల్పుల వీరేంద్ర, సంజీవ, వెంకటేష్, నరసింహులు, బాలాజీ, నాగేంద్ర తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags: Let us strengthen the Janasena Party from the village level.