June 30, 2026
Explore
రైలు కింద పడి వివాహిత ఆత్మహత్య

రైలు కింద పడి వివాహిత ఆత్మహత్య

June 30, 2026 | Andhra Pradesh

రెడ్డిపల్లి ముచ్చట్లు:

పుల్లంపేట (మం ) రెడ్డిపల్లి రైల్వే పట్టాలపై సోమవారం సాయంత్రం దంతం సునంద కుమారి (25) అనే వివాహిత గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది.

మృతురాలికి ఎనిమిది సంవత్సరాల క్రితం దంతం మణి ఆచారితో వివాహం జరిగింది.

జీవనోపాధి నిమిత్తం భర్త కువైట్‌లో పనిచేస్తున్నాడు.

గత నాలుగు సంవత్సరాలుగా భర్త స్వగ్రామానికి రాకపోవడంతో సునంద మనోవేదనకు గురవుతూ ఉండేదని ఆమె తల్లి ఆరోపించారు.

ఆత్మహత్యకు గల అసలు కారణాలు తెలియరాలేదు.

ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: Married woman commits suicide by jumping under a train.