June 30, 2026
Explore
రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు యత్నం

రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు యత్నం

June 30, 2026 | Andhra Pradesh

వాల్మీకిపురంముచ్చట్లు:

-లోకోపైలట్ షడన్ బ్రేక్‌ వేయగా తప్పిన ప్రాణాపాయం

-మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

మదనపల్లె రైల్వే స్టేషన్ పీఎఫ్ చివర్లోని వాల్మీకిపురం వద్ద గుర్తు తెలియని వ్యక్తి సోమవారం అర్థ రాత్రి రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించి గాయపడ్డాడు. నాగర్‌కోయిల్ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు వస్తుండగా ఒక వ్యక్తి ట్రాక్‌పై పడుకుని ఉన్నాడు. రైలు నిదానంగా రావడంతో లోకోపైలట్ గమనించి వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు. అయినా రైలు అతనిని స్వల్పంగా తాకడంతో తలకు సాధారణ గాయమైంది. వెంటనే లోకోపైలట్, సిబ్బంది అతనిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. సమాచారం అందుకున్న ఆర్‌పీఎఫ్ అధికారులు బీట్ సిబ్బంది బాధితున్ని మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి షిఫ్ట్ చేయాలని సూచించారు.
ఆర్‌పీహెచ్‌సీ మహబూబ్ బాషా బాధితుడి స్టేట్‌మెంట్ తీసుకోవాలని ఆదేశించారు. అయితే గాయపడిన వ్యక్తి తన పేరు, వివరాలు చెప్పడం లేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Unidentified person attempts suicide by jumping in front of a train.