June 30, 2026
Explore
పీలేరులో డీకేటీ భూమిని ప్లాట్లుగా విక్రయించి మోసం చేశారని ఫిర్యాదు

పీలేరులో డీకేటీ భూమిని ప్లాట్లుగా విక్రయించి మోసం చేశారని ఫిర్యాదు

June 30, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు:

పీలేరులో రియల్టర్లు డీకేటీ భూమిని ప్లాట్లుగా విభజించి విక్రయించి తమను మోసం చేశారని పలువురు ఆర్టీసీ ఉద్యోగులు ఆరోపించారు. సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRSలో వారు ఫిర్యాదు చేశారు. పీలేరుకు చెందిన డీఆర్ నాయుడు, మరికొందరు తమను నమ్మించి డీకేటీ భూమిని ప్లాట్లుగా విక్రయించారని తెలిపారు. ఉద్యోగులంతా కలిసి సుమారు రూ.2 కోట్ల విలువైన ప్లాట్లు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని జిల్లా అధికారులను కోరారు.

Tags: Complaint filed alleging fraud involving the sale of DKT land as plots in Pileru.