మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె ఈశ్వరమ్మకాలనీకి చెందిన కోలారు మంజునాథరాజు, ఆడవేషాలు వేసుకొని మోసాలకు పాల్పడుతున్న పొత్తూరి మోహనకృష్ణమనాయుడు అలియాస్ మధుశ్రీ అలియాస్ హనీ తన నుంచి రూ.5 లక్షలకు పైగా నగదు, బంగారం తీసుకుని మోసం చేశాడని ఆరోపించారు.
కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మంజునాథరాజు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మాయమాటలు చెప్పి తన నమ్మకాన్ని దుర్వినియోగం చేసి డబ్బు, బంగారం తీసుకుని మోసం చేశాడని వాపోయారు. ఇప్పటికే ఇదే తరహాలో పలువురిని మోసం చేసినట్లు అతనిపై పోలీసు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. తన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు, ఇతర బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరారు.
Tags: Fraud in female disguise… Victim alleges theft of ₹5 lakh and gold.