June 30, 2026
Explore
కర్ణాటక మద్యం పట్టివేత.. ఇద్దరికి రిమాండ్

కర్ణాటక మద్యం పట్టివేత.. ఇద్దరికి రిమాండ్

June 30, 2026 | Andhra Pradesh

రామసముద్రం ముచ్చట్లు:

రామసముద్రంలో సోమవారం ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో అక్రమంగా కర్ణాటక మద్యం నిల్వ ఉంచిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఉగిని నాగరాజ్ (47) వద్ద నుంచి 30, ఉగిని ప్రశాంత్ కుమార్ (30) వద్ద నుంచి 32 కర్ణాటక మద్యం పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 62 మద్యం పొట్లాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన అధికారులు నిందితులను మదనపల్లె కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. అనంతరం వారిని మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు.

ఈ దాడుల్లో ఎస్‌ఐ డార్కస్, హెడ్ కానిస్టేబుల్ ఆలీ, కానిస్టేబుళ్లు నాగరాజు, గంగమహేశ్వరి పాల్గొన్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జి. భీమలింగ తెలిపారు.

Tags: Karnataka liquor seized; two remanded.