June 30, 2026
Explore
ఐషర్ లారీ బోల్తా.. 15 మంది కూలీలకు స్వల్ప గాయాలు

ఐషర్ లారీ బోల్తా.. 15 మంది కూలీలకు స్వల్ప గాయాలు

June 30, 2026 | Andhra Pradesh

మదనపల్లెముచ్చట్లు:

మదనపల్లె బైపాస్‌లో సోమవారం రాత్రి ఐషర్ లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన 15 మంది కూలీలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తట్టివారిపల్లె సమీపంలో భవన నిర్మాణ పనులు ముగించుకుని సిమెంట్ మిక్సర్ యంత్రాన్ని ఐషర్ లారీలో లాక్కుంటూ నీరుగట్టువారిపల్లికి వెళ్తుండగా, బైపాస్ రోడ్డులోని రాయల్ ఉడ్ దుకాణం సమీపంలో లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన కూలీలను మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇది సెల్ఫ్ యాక్సిడెంట్ అని, తమకు ఎలాంటి కేసు అవసరం లేదని కూలీలు తెలిపి నీరుగట్టువారిపల్లికి వెళ్లిపోయారని రెండో పట్టణ సీఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ఘటనపై పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు.

Tags: Eicher lorry overturns; 15 laborers sustain minor injuries.